Sunday, 27 November 2011

living again..


నిర్లిప్తం గా నిశ్శబ్ధంగా సాగిపొతున్న జీవితం...
ఒక్కసారిగా తుళ్ళిపడ్డట్టుగా అయ్యింది నీ పరిచయంతో,
వంటికి బంకలా ఉన్న యంత్రికత తొడుగులను విదిలించి కొట్టగానే..
చైత్రమాసపు వెన్నెల మల్లెలంత సౌకుమార్యంతో ముంచెత్తివేసింది..


గతించిన జ్ఞాపకాల స్వరపేటికను కదిలిస్తూ..
కోయిల కమ్మని రాగాన్ని ఆలపిస్తుంది.
ఘనీభవించిన గుండే కవాటాలు తెరచుకుని 
హ్రుదయం విహంగమై ఆకాశపుటంచులను తాకుతోంది..


ఈ అనుభూతి కలలోని నిజమో...
లేక నిజం కాబోయే కలో తెలియక తడబడుతున్నను..
ఈక్షణం అనిపిస్తుంది నాకు..
తిరిగి నేను చిగిరిస్తున్నానేమో అని..... 

No comments:

Post a Comment